ఈ పుట ఆమోదించబడ్డది
చిన్న చిన్న కణములుగల గుండ్రనిరాశి యగును. ఈ రాశియందుండు సమస్తకణములును ఒక దానినొకటి తేనెతెట్టెలోని కండ్లవలె సర్వవిషయముల బోలియుండును.
మల్బెరీదశ.
ఇంతవర కీకణములందు రూపవ్యాపారాదిభేదము లీషన్మాత్రమైన నుండవు. ఇట్టి యనేక కణపిండదశ సమస్తమైన జీవులకును గలదు. ఇట్టి దశకు మల్బెరీదశ యని పేరు. మల్బెరీ () యనగా పట్టుపురుగులుండు చెట్టు. ఈ కణములరాని పట్టుపురుగు యొక్క గ్రుడ్లరాశిని బోలియుండుటచేత కాబోలు నీయనేక కణపిండదశకు మల్బెరీదశ యనిపేరు కలిగినది (30-వ పటములో గ్రుడ్లను, 29-వ పటములో 4-వ దశను పోల్చి చూడుము).