5 - కణములన్నియు మధ్యనుండి వెలుపలికి గెంటబడి చుట్టును కడియమువలె జేరియున్నవి. మధ్యభాగము శూన్యముగా నున్నది. ఈదశయందు కణములో కొంత వ్యత్యాసము కన్పట్టుటకు ప్రారంభమైనది. ఎట్లన, పైభాగమున నుండు కణములు చురుకుగ పెరిగి పొడవగుచున్నవి. క్రిందిభాగమునందలి కణములు మందముగ పెరుగుచు పొట్టివిగ నున్నవి.
6 - ఇందు పైభాగమున నొకచోట కొంచెము గుంటపడి యక్కడికణములు క్రిందికి దించుకొనిపోయి యున్నవి.
7 - ఈగుంట క్రమముగా పెద్దదయి యొక గొట్టముగ నేర్పడుచున్నది. ఈగొట్టముయొక్క సరిహద్దుగోడ రెండువరుసలకణములచే నేర్పడియున్నది. 6-వ పటములో పైభాగమున నుండు పెద్దకణములు ఈగొట్టమునకు లోపలితట్టునను క్రిందిభాగమున నుండు చిన్న కణములు వెలుపలి తట్టునను అమరియున్నవి. ఈ లోపలివరుసలోని పెద్దకణములే హైడ్రాయొక్క అంతశ్చర్మకణము లగును. వెలుపలివరుసలోనిచిన్న కణములు బహిశ్చర్మకణము లగును.
8 - ఈ దశయందు హైడ్రా మృదురోమములు గలిగి యీదుచుండును. తరువాత కొంతకాలమున కిది యేదో యొక పదార్థమున కంటుకొని మృదురోమముల విసర్జించి నిలువున పెరిగి సంపూర్ణమైన హైడ్రా యగును.
ఏర్పరచుకొనును. ఈప్రకారము సంరక్షింపబడిన పిండము (Embryo) నీటిలో బడి మునిగి నేల నంటి కొంతకాలము విశ్రమించును. పిమ్మట కొంత కాలమునకు దీనినుండి హైడ్రా యెట్లు పుట్టునో క్రింద వ్రాయబడును.
సంయుక్తబీజము ప్రథమమున ఏకకణము. దీని కేకకణ పిండ మని పేరు. ద్విఖండనవిధానముచే నా పిండము రెండుగా చీలును (29-వ పటములో 1. చూడుము). ఈ రెండుకణములలో ఒక్కొక్కటియు తిరిగి రెండేసికణము లగును. ఇట్లే క్రమముగా 4, 8, 16, 32, 64, మున్నగు ననేక కణములుగ చీలి యాపిండము,