యుండుటచేత నా యాహారపదార్థములుగూడ నీ ఉపశ్వాసము మూలముననే పై కెక్కింపబడుచున్నవని గ్రహింపనగు. ఈ యుపశ్వాసముచే (Transpiration) ఆవిరియై పోవు నీటిని తరుణమందు తిరిగి యథాస్థానమున సంపూర్తి జేసినగాని మొక్క జీవింప నేరదు. దీనికి దృష్టాంతముగా మన మొక మొక్కను పీకి గట్టున వైచిన కొద్దికాలములోనే యది వడలిపోవును. ఏలయన, దాని యాకులనుండి వెలుపలికి బోవు నీటియావిరిమూలమున ఖర్చకు నీటికిబదులుగా వేళ్ల నుండి పీల్చబడి జమయగు నీరు, ఆ మొక్క పీకి గట్టుమీద వేయబడియున్నప్పుడు లోటుపడియున్నందున ఆహారము లేమిచే నా మొక్క యెండిపోవును.
కాబట్టి యీ యుపశ్వాసమువలన నైన ప్రవాహముచే నీరును, లోహపదార్థములును, భూమినుండి ఆకులు మొదలగు భాగములయందుండు సమస్తకణములకును నీడ్వబడుచున్నవి. ఈ ప్రవాహ మొకకణమునుండి మరియొక కణమునకు వాని పలుచని కణకవచములగుండ చెట్టుయొక్క క్రిందిభాగమునుండి పై భాగమునకు వ్యాపించియుండును.
ఎండవేళలయందు ఆకులయందలి హరితకములచే బొగ్గుపులుసుగాలి (CO2) విడదీయబడి, యందలి కర్బను నీటితోగూడి కర్బనోజ్జనితము (Carbohydrate) అగును. నీటిలో లీనమైయున్న నత్రితములతో నిది కలియుటచే అనేకములైన మిశ్ర పదార్థములు మధ్య అంతస్తుగా నేర్పడి తుదకు మూలపదార్థమగును.