Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాహారపదార్థములు వేళ్లనుండి యాకులకును, జేర్చుమార్గము లుండవలయును. ఇంతవరకు జదివిన జీవులలో ప్రతి కణమును స్వతంత్రముగా తన యాహారమును తాను సంపాదించుకొనునదే కాని యొకదాని సహాయమును మరియొకటి అపేక్షించునదిలేదు. అదిగాక వాని కణకవచములు మిక్కిలి పలు చని వగుటచేత నొక కణముయొక్క మూలపదార్థము దాని ప్రక్కకణముయొక్క మూలపదార్థముతో కొంచెమించు మించుగా పూర్ణమైనసంబంధము గలిగియున్నది. కాబట్టి వానియం దిట్టిమార్గములు అగత్యము లేక పోయినవి.

ఇట్టి మార్గముల నిర్మాణములు హెచ్చుతరగతి వృక్షములలో మిక్కిలి బాగుగ జూడగలము. అయినను ముఖ్యాంశములయందు నాచుమొక్కయొక్క నిర్మాణమును వానినే బోలియున్నది.

ఉపశ్వాసము.

ఆకులయొక్క యుపరితలమునందుండు కణములనుండి యెడతెగక నీటియావిరి గాలిలోనికి బోవుచుండును. దీనికి ఉపశ్వాసము (Transpiration) అని పేరు. ఇది వృక్షములయొక్క ఆహారస్వీకరణములో ముఖ్యాంశముగా నెంచదగియున్నది. ఏలయన, పై జెప్పినప్రకార మావిరిగా బోవు నీటియొక్కస్థలమును తిరిగి యాక్రమించుటకై యెల్లప్పుడును వేళ్లచే నీరు పీల్చి పంపబడును. కాన నీ యుపశ్వాసములవలననే నిరంతరము నీటిప్రవాహము మొదటనుండి కొనవరకు నేర్పడుచున్నది. ఈ నీటియం దాహారపదార్థములలో కొన్ని లీనమై