Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనల సన్నమును గలవై యున్నవి. వాని కణకవచము మిక్కిలి దళసరెక్కి కొంచె మెర్రగా నుండును. ఇట్లు బలమైన వగుటచేతనే యీ కణములు మొక్కయొక్క లోపలిభాగములను సంరక్షించునవిగాను, కొమ్మను నిలువబెట్టుశక్తి గలవిగాను ఉన్నవి. ఇట్టి కణముల అల్లికకు దృఢసారము (Sclerenchyma) అని పేరు (21-వ పటములో దృ). కొమ్మయొక్క మధ్యభాగమున నిలువున వ్యాపించు పలుచని కణకవచముగల చిన్న చిన్న కణముల పేర్పునకు నడిమికట్ట (Axial bundle) యని పేరు. ఈ రెంటి మధ్యనుండు సామాన్యకణముల యల్లికకు మృదుసారము (Parenchyma) అని పేరు.

ఆకు:- నాచుమొక్కయొక్క ఆకు బల్లెపు అలుగువలె మొనతీరియుండు కొనయును వెడల్పైన మొదలును గలిగియుండును (21-వ పటములో A-లో అ). ఆకుయొక్క మధ్యభాగమున పొడవునను వ్యాపించియుండెను. ఈనె యనుభాగము పెక్కువరుసలుగనుండు కణములకూర్పుచే కట్టబడిన స్తంభమువంటిది. ఇందలి కణములు కొంచెము పొడుగుగను లావుగను ఉండును (21-వ పటములో D). ఈనెకు రెండువైపులనుండు భాగములు ఒక్కఇటికదళసరిని చప్టావలె పరుచబడిన కణముల చదరపుపేరుపు. ఇందలికణములు కొంచెము పొట్టిగా నుండును. ఇందు కణములవరుస లొక దానిప్రక్క నొకటి అమర్పబడియుండును గాని యొకదానిపై నొకటి ఎక్కియుండదు. ఈ కణములందు అండాకృతి గల హరితకము (Chromatophores) లుండును.