Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

B. నాచుకొమ్మయొక్క చివరభాగము. అం-అంత్యకణము. ఉ. అ-ఉపాంత్యకణము. ఉపాంత్యకణమునుండి తక్కిన కణములన్నియు పుట్టుచున్నవి. ఆ-ఆకులు.

C. అంత్యకణముయొక్క ఆకారము. ఇది నాలుగు భుజములు గలది. 1,2,4 ఇది యొకభుజము. 1,2,3 ఒకభుజము. 2,3,4 ఒకభుజము. 1,3,4 అను భుజము పటములో మరుగుపడియున్నది. అందు 1,2,3 అను భుజమునుండి తప్ప తక్కిన మూడుభుజములనుండి ఒక్కొకభుజమునుండి యొక్కొక కణము చొప్పున ప్రతిపర్యాయము మూడేసికణములు ఖండన మగుచుండును.

D. ఇది యొక ఆకుయొక్క సూక్ష్మనిర్మాణము. దాని మధ్యభాగమున లావుగ నుండునది ఈనె. ఈనెయందు కణములు పెక్కువరుసలుగా నుండును. తక్కినభాగములందు కణములు ఒకటేవరుసగా నుండును.

E. నాచుకొమ్మను నిలువున చీరగా నేర్పడిన మిక్కిలి పలుచనిపొర యొకటి.

F. అడ్డముగ కోయగా నేర్పడిన పలుచనితునక. సగముభాగము మాత్రమిందు చూపబడినది. దృ-దృఢసారము. మృ-మృదుసారము. న-నడిమికట్ట. వే-వేరు. ఆ-ఆకు.

బోలియుండక కొంత వ్యత్యాసమును చూపట్టును (21-వ పటములో E. F. చూడుము). వెలుపలివైపున నుండు రెండుమూడు వరుసలలోనికణములు కొమ్మయొక్క పొడుగు ననుసరించి అనగా నిలువున పెరిగి నూలుకండెవలె నడుమ లావును