పుట:Jeevasastra Samgrahamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలతంతువులు (Rhizoida):- ఇవి దీనివేళ్లు. ఇవి కణములపంక్తులు (21-వ పటములో F-లో వే). ఇందు కణము లొక దానికొన నొక టంటి యొక పూసలసరమువలె పేర్చబడి యుండును. ఇందు హరితకము లుండవు.

కొన మొగ్గ (Terminal bud):- కొన మొగ్గయందలి యాకులు వారిపర్ణి యందువలెనే శాఖాంతమును రక్షించుటకై యొక దానిపై నొకటి విల్లువంపుగా వంగియుండును. శాఖాంతమున అంత్యకణము (Apical Cell) కణ మొక టుండును (21-వ పటములో B-లో అం). ఇది వారిపర్ణి యందలి యంత్యకణముకంటె సంమిశ్రణమందు (Complexity) హెచ్చినది. కాబట్టియే దీని వ్యాపారములయందు ఆధిక్యతకూడ హెచ్చినది. దాని యంత్యకణము లింగాకారముగ నుండునని వ్రాసితిమి. దీని అంత్యకణము అట్లుగాక తాడిచెట్లు పగులగొట్టుట కుపయోగించెడు దోరపుచిప్ప (Wedge) వంటి ఆకారము గలిగి 21-వ పటములో C. అనుచో జూపబడిన ప్రకారము నాలుగు త్రిభుజములవలన (Triangles) జేయబడిన ఘనాకృతి గలిగి కొన క్రిందుగను పీఠము (Base) పైవైపునకును ఉండును. ఈ కణమునుండి ఖండము లొక క్రిందివైపునమాత్రమే ఖండింపబడక యొక్కొక సారెకు మూడుప్రక్కలనుండి మూడుకణములు ఖండింపబడును.

ఈవిషయమై చక్కగా తెలిసికొన దలచునెడల నొక కందదుంపనుండి (F.) నలువైపుల నాలుగుత్రిభుజములు సరిహద్దు