పుట:Jeevasastra Samgrahamu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదింటికొనలయందు రెండేసికణములు బురుజులవలె (Crown) నేర్పడియుండును (20-వ పటములో E. లో బు.) ఇ ట్లీబురుజు కణములచే నేర్పడిన శిఖరముగుండ నొక సన్ననిరంధ్రము అడుగునుండి పైకి వచ్చుచు స్థూలబీజాశయముయొక్క లోపలిభాగమును నీటితో సంబంధముగలదానినిగా జేయును.

పూర్ణముగా తయారయిన మొక్క యొక్క ప్రతిభాగమును, అనగా స్కంధకణములును, స్కంధశిరకణములును, ఆకులును, వేళ్లును అన్నియు అంత్యకణమునుండియే ఏర్పడుచున్న వనియు, అవి బాల్యమునం దొకదాని నొకటి బోలియుండు కణములే యనియు ఆయాకణములయొక్క హెచ్చుతగ్గులైన కణవిభాగము (Cell division) కణవ్యత్యాసము (Differentiation) మొదలగు హేతువులచే వివిధరూపములు గలుగుచున్న వనియు జదివియుంటిమి. అట్లే బీజాశయములందుగూడ వాని ప్రతిభాగమును అంత్యకణము (Apical Cell) నుండి గలుగుచున్నదనిచెప్పిన వింతగా దోచవచ్చును.

సూక్ష్మబీజాశయములయుత్పత్తి.

ఇది మొట్టమొదట తొడిమ నంటియుండు నొక గుండ్రని కణము. ఇది క్రమముగా నెనిమిదికణములై యొక్కొకో టొక్కొక బద్దగా నగును. ఇం దొక్కొక్కటియు రెండుకణములుగానగును. అందు లోపలికణము తిరిగి రెండుకణము లగును. ఇప్పుడు ప్రతి బద్దయు మూడుకణములు గలదై యున్నది. అందు వెలుపలిది విల్లువంపుగా నుండు భాగము. నడిమిది పిడివలె నుండునది. లోపలిది