తలకణము (20-వ పటములో A. B. లలో బ (బద్ద), పి (పిడి) త. క. (తలకణము), చూడుము).
ఈ తలకణమునుండి ముందలకణములును, బీజతంతువులును, స్ఫోటన (Budding) విధానమున పుట్టును. కాన నొకచిట్టిఆకు (Leaflet) నుండి సూక్ష్మబీజాశయము మంతయు కొన్ని మార్పులచే పరిణమించుచున్నదని చెప్పనగును. చిట్టిఆకునుభరించెడి తల్లియాకే తొడిమగా పరిణమించుభాగము.
స్థూలబీజాశయములయుత్పత్తి.
ఇదియునుగూడ ఏకకణమునుండియే యుత్పత్తి యగుచున్నది. ఆకణము తత్క్షణమే మూడుకణములుగా విభజింపబడి ఒక దానిపై నొకటి యెక్కి వరుసగనుండును (20-వ పటములో D. E. F. లో తొ. స్కం. శి. స్థూ. బీ. చూడుము). ఇందు మధ్యకణము (స్కం. శి.) నుండి పది మొటిమలు పుట్టి యవి పదికణములై మెలికలుతిరుగుచు పై కెక్కుచు స్థూలబీజాశయముయొక్క వెలుపలిగోడ నేర్పరచుచున్నవి. ఈ మూటిలోని పైకణము స్థూలబీజమగును. క్రిందికణము తొడిమి యగును. పిమ్మట ఈ మెలికకణముల అంత్యభాగమున రెండు అడ్డుపొర లేర్పడి యా పొరలు బురుజుకణములను ఖండించుచున్నవి. ఇవి స్థూలబీజముకంటె ఎత్తుగా పెరిగి దానిని నలువైపుల నావరించి శిఖరముగా నేర్పడుచున్నవి. ఇట్టి నిర్మాణమునుబట్టి స్థూలబీజాశయ మంతయు నొక శాఖాంత్యకణమునుండి కణవిభాగము, కణ వ్యత్యాసములవలన పరిణమించుచున్నదని స్పష్టపడుచున్నది. అది