పుట:Jeevasastra Samgrahamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థూల (ఆడ) బీజాశయము (Ovary).

ఇది అండాకృతి గలిగి యొక చిన్న తొడిమచే ఆకు నంటియుండును (20-వ పటములో D. E. F. లో తొ. చూడుము). దానిచివర కూజాగొట్టమువంటి పొడుగైన గొట్ట మొకటి యుండును (20-వ పటములో F). స్థూలబీజాశయముయొక్క వెలుపలివైపున మరమేకు చుట్లవలె తిరుగుచు పై కెక్కెడు చాళ్లు (Grooves వ్యా. క.) కనుబడును. ఇవి అడుగుననుండి మీదికెక్కి పై భాగమున నన్నియు బురుజులో జేరిపోవును (క్రింద చదువుము). లేత ఆశయములందు మధ్యభాగమున కాంతిహీనమైన ముద్దవంటి పదార్థ మొకటి కానబడు చుండును (20-వ పటములో D. E. F. లో స్థూ. బీ. చూడుము). ఈ ఆశాయమును చిన్నచిన్న తునకలుగా ఖండించి వానిని సూక్ష్మదర్శనిలో పరీక్షించునెడల మధ్య నుండెడి యా పదార్థము స్థూలబీజమనియు, అది పిండి (Starch) యను నొక యాహారపదార్థపు నలుసులతో పూర్ణముగా నిండి యున్నదనియు తెలియగలదు. ఇది తొడిమ (తొ.) కొక చిన్నకణము ద్వారా అంటియుండును (20-వ పటములో D. E. F. లో స్కం. శి. చూడుము). తొడిమయును ఒక్కటే కణమువలన నైనది. తొడిమకును బీజమునకును మధ్యనుండు ఈ చిన్నకణమునుండి పదికణము లుద్భవించి, అవి మరచుట్టు చుట్లవలె తిరుగుచు పై కెక్కుచు స్థూలబీజముచుట్టు పటములో జూపిన ప్రకారము మెలితిరుగును. ఇట్లు తిరుగుచుపోయెడు కణములకు వ్యావర్తక కణము లని పేరు (20-వ పటములో వ్యా. క. చూడుము). ఈ