Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని రెండుభాగములుగలవు. సూక్ష్మదర్శనిలో పరీక్షించునప్పుడు ప్రతిస్కంధమునొక పెద్దకణముగా నగపడును (18-వ పటములో ఖం3. లో స్కం. చూడుము). ఒకానొకప్పుడు ముదిరినభాగములలో నిది అంగుళము లేక అంగుళమున్నర పొడవుగ నుండును. స్కంధశిరమనుభాగము పొట్టిదైనను, అడ్డముగా ఒండొంటి ప్రక్కన నమరియుండుకణములుగా విభజింపబడియుండును (18-వ పటములో ఖం3. ఖం4. లలో స్కం. శి. చూడుము). ఈ అడ్డకణములవరుసను క్రిందివైపునను పైవైపుననుగూడ పొడుగైన స్కంధకణము లుండును (18-వ పటము చూడుము). స్కంధశిరమునుండి ఉపశాఖలును, ఆకులును పుట్టును (ఆ3. ఆ2. ఆ1.).

ఆకులు:- ఒక యాకును సూక్ష్మదర్శనిలో పరీక్షింపగా నందు మొట్టమొదట స్కంధకణమువంటి యొక పొడుగైనకణ మగపడును (17-వ పటములో B-లో ఆకు. చూడుము). ఈ స్కంధకణముపైని స్కంధశిరకణములవంటికణములు రెండుమూ డుండును. దాని పై భాగమున చిట్టిఆకులను చిన్నచిన్న ఆకులు రెండుమూ డుండును (17-వ పటములో C). ఒక్కొక్క చిట్టిఆకు సామాన్యముగా మూడుకణములచే కూర్పబడియుండును. ఈకణము లొకదానిపై నొకటిగా నమరియుండి క్రమముగా చిన్నవియగును. అందు తుదనుండుకణము సూదిమొనవంటి మొనగలిగి యుండును.

కాబట్టి వారిపర్ణి యంతయు కణములసముదాయము. ఇందలికణము లొక నిర్ణయమైనరీతిని అమర్చబడియుండును. ఇంతకు పూ