Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంగనుండియు నొక పిల్లకొమ్మ అంకురించును (A-లో ఉ. శా. చూడుము). అది సర్వవిషయముల తల్లికాడను బోలి, స్కంధమును, స్కంధశిరమును, ఆకులును గలిగియుండును. దీని తుదనుండు కొనమొగ్గ దీనికొనను సంరక్షించుచుండును. అడుగునుండి చివరవరకు వ్యాపించు తల్లికొమ్మకు ప్రకాండము (Primary Stem) అని పేరు. తక్కిన కొమ్మలకు ఉపఖాండములు లేక ఉపశాఖలు (Secondary Stems) అని పేరు. కాండమన్నను శాఖయన్నను సర్వత్ర అన్నికొమ్మ (Stem) లకు వర్తించును. ప్రకాండమును, ఉపఖాండములును గూడ కొనమొగ్గచే కప్పబడి ముగియును (A-చూడుము). మూలతంతువులుగూడ ఉపకాండములవలె కనువులనుండియే అంకురించును (A-లో ను. వే. చూడుము).

బీజాశయములు.

శరదృతువునందు దీని కొమ్మలయొక్క చివర ఆకులమీద సూక్ష్మమైన నారింజపండ్లవలె గుండ్రముగానుండు చిన్న చిన్న మొటిమలు పసిడివర్ణముగలవై ప్రకాశించుచుండును. ఇవి సూక్ష్మబీజాశయములు. అనగా మగబీజముల కునికిపట్టయిన తిత్తులు. వీనిమధ్య నక్కడక్కడ కూజావంటి ఆకారముగల స్థూలబీజాశయములుగూడ నుండును. ఇవి లేతవైనప్పుడు గోధుమరంగుగను, ముదిరినపిమ్మట నలుపురంగుగను ఉండును. ఇవి ఆడబీజములకునికిపట్టు.

సూక్ష్మ నిర్మాణము (Histology).

శాఖలు:- ప్రతిశాఖయు ననేక ఖండములచే నేర్పడియున్నది. అందు ప్రతిఖండమునందును స్కంధము స్కంధశిరము