Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము.

ఏకపత్రము ; వారిపర్ణి (Monostroma ; Chara).

సముద్రతీరమందు పోటుపాటులచే నిత్యము తడిసి యారుచుండు రాతిగుట్టలమీద ఏక పత్రమను నొక రమ్యమైన హరిత వర్ణముగల పలుచనియాకువలె నుండు నాచుజాతిలోని మొక్కయొకటి పెరుగును. ఈవరకు జదివిన బూజుపోగునందును, పసిరిక పోగునందును కణములన్నియు నేక పంక్తిగా నొకదాని ప్రక్క నొకటి చేరి పూసలదండవలె నుండెనని గ్రహించి యుంటిమి. ఏక పత్రమును సూక్ష్మదర్శనిలో పరీక్షించిన అందు కణములపంక్తు లనేకము లొకదానిప్రక్క నొకటి చేర్చబడి యున్న ట్లుండును

(16-వ పటము చూడుము). ఇది ఒంటి యిటిక దళసరిని పరచిన ఇటిక చప్టాను బోలియుండును. ఇందు ఇటికలు అడ్డముగను, నిలువుగను వరుసలుగా నుండునుగాని యెక్కడ చూచినను ఇటికపై నిటిక యుండదు. అట్లే దీనియందలి ఆకుపచ్చని ఇటికలవలె నుండు కణములును ఒక దాని ప్రక్క నొకటి బల్ల పరుపుగా సెల్లులూసు అను అడుసులో నమర్చిబడియుండును. కాని యొక కణముక్రింద మరియొకకణ ముండదు. ఒండొరుల కణకవ