చము లించుమించుగా నంటియుండును. కాన నీ ఏక పత్రము కణములయొక్క చదరపు పేర్పు.
పసిరిక పోగు లొకదానిసరస నొకటి యొక కాగితముమీద మిక్కిలి క్రిక్కిరిసియుండు రూళ్ల వలె (Rules) సమాంతరములుగా (Parallel) అనేక తంతువుల నమర్చునెడల నిదే యాకార మేర్పడును. కావుననే ఏకపత్ర మనేక కణపంక్తుల కూర్పుచే నైనదని చెప్పవచ్చును. ఇందు నొక పంక్తిప్రక్క మరియొక పంక్తి యుండునుగాని యొక దానిక్రింద మరియొకటి యుండదు.
ఏకపత్రము మిక్కిలి పలుచని ఆకుపచ్చని పొరలవలె నుండును. ఈ మొక్కయంతయు నొక యాకును బోలియుండుటచేత దీనికి ఏకపత్ర మనుపేరు గలిగెను. దీని కణములందు హరితకము లుండుటచేత దీని యాహారము కేవల వృక్షాహారమని చెప్పనగును.
వారిపర్ణి (Chara).
మంచినీళ్ల చెఱువులలో మొలచు నాచు మొదలగు తుక్కులో వారిపర్ణి యను మొక్క మన మనుదినము జూచు పెద్ద వృక్షములవలె ఆకులును, కొమ్మలును, వేళ్లును గలిగియుండుటచేత, మిక్కిలి సులభముగ గుర్తింపదగియుండును (17-వ పటములో A. చూడుము).
నిర్మాణము:- ఇది వలయాకారముగల మృదువైన తీగెవలె నుండు తల్లికాడ గలిగి సుమారు 7 లేక 8 అంగుళములు