పుట:Jeevasastra Samgrahamu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈషన్మాత్రము ఏర్పడియున్నది. ఏలయన, సంయోగులు రెండును సమరూపులును, సమపరిమాణులును అయినను, మనము ముందు జదువబోయెడు అనేకజీవుల సంతాన వృద్ధివిధానములతో దీనిని పోల్చి చూచినయెడల వీనియందలి చురుకైన సంయోగులు మగవనియు, మందములగునవి ఆడువనియు తెలియగలదు. సామాన్యముగా మగవి చిన్నవిగను ఆడువి పెద్దవిగను ఉండుటచేత మగవానిని సూక్ష్మసంయోగులు (Microgamates) అనియు ఆడువానిని స్థూలసంయోగులు (Magagamates) అనియు వాడుదుమని చెప్పియుంటిమి (102-వ పుట చూడుము). ఇట్లే సూక్ష్మసంయోగులు గల కణములకు సూక్ష్మబీజాశయములనియు, స్థూలసంయోగులు గల కణములకు స్థూలబీజాశయములనియు పేరు. B. అను పటములో పై పోగునందలికణములు సూక్ష్మ (మగ) బీజాశయములు (సూ. బీ. అ); క్రిందిపోగునందలి కణములు స్థూల (ఆడ) బీజాశయములు (స్థూ. బీ. అ); మగసంయోగికి సూక్ష్మబీజమనియు (Microspore), ఆడుసంయోగికి స్థూలబీజమనియు (magospore) గూడ పేరులు గలవు. సూక్ష్మస్థూలబీజముల సంయోగముచే నేర్పడిన ఫలితమునకు సంయుక్తబీజము (Zygote) అని పేరు.

పైని జెప్పబడిన విధానమువలన ప్రత్యేకముగా రెండు పసిరికపోగులు సమీపించి జతగూడి యం దొక దానికణములు మరియొకదానికణములతో నైక్యమగుటయేగాక, ఒకటే పోగునందుండు సన్నిహితకణము లొకదానితో నొకటి సంయోగమగు