టయు గలదు. పటములో C1. లో జూపబడిన ప్రకారము ఒక పోగునందలి రెండు సన్నిహితకణములలో వాని సరిహద్దు గోడనుజేర్చి ఒకదానిమొటిమ మరియొక దాని మొటిమను అనునట్లుగా రెండుకణములును ఉబ్బును (పటములో C1. చూడుము). పిమ్మట నీ రెండు మొటిమల మధ్యనుండు గోడ హరించిపోయి యొక చిన్న మార్గమేర్పడి రెండుకణములు నొక దానితో నొకటి సంబంధము గలిగియుండును (C2, చూడుము). ఆరంధ్రముగుండా రెంటిలో నేదో యొక కణమునందలి మూలపదార్థము ముద్దగా గూడి, దానిప్రక్కనుండు కణములోనికి ప్రవేశించి దానియందలి మూలపదార్థముతో సంయోగమునొంది సంయుక్తబీజ మేర్పడును (C2. లో సం. బీ. చూడుము). ఇందు ఏకణము సంయోగార్థము ముందుగా ప్రయత్నించు చున్నదో అది సూక్ష్మబీజాశయము; అనగా మగది. దేనియందలి మూలపదార్థము తనస్థానమును కదలక యుండియు సంయోగమును జెందునో అది స్థూలబీజాశయము; ఇది ఆడుది సంయోగనిమిత్తమై సూక్ష్మబీజాశయమునందు కూడిన మూలపదార్థపుకూడికకు సూక్ష్మబీజము (Microspore) అని పేరు. స్థూలబీజాశయమునందలి అట్టికూడికకు స్థూలబీజము (Magaspore) అని పేరు. ఇట్టి బీజముల సంయోగమువలన నయ్యెడు ఫలితము సంయుక్తబీజము.
ఏకాంగులు; ఉభయాంగులు.
నిచ్చెనరూపమును గలిగించు సంయోగవిధానమం దొక పోగునందలి సంయోగులన్నియు మగవిగను రెండవదాని యందలి సంయోగులన్నియు ఆడువిగను ఉండునని చెప్పియుంటిమి. ఇట్లు