Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలపదార్థము కణకవచమునుండి విడివడి కణముమధ్య నొక ముద్దగా జేరును. ఈముద్దలే ప్రత్యక్షముగా సంయోగక్రియయందు నైక్యమగు సంయోగులు (Gamates). సంయోగార్థమై సమీపించు రెండుపోగులలో నేదో యొక దానియొక్క కణములయందలి మూలపదార్థము రెండవదాని కణములందలి మూలపదార్థముకంటె ముందుగా పైని జెప్పబడినప్రకారము ముద్దగా కణముమధ్యకు చేరును (B-లో పైవైపుననున్న పోగు చూడుము). ఇట్లు ముందుగా సిద్ధపడిన బీజాశయములయందలి మూలపదార్థము రెండవపోగునందలి కణములలోనికి పైని జెప్పబడిన మార్గములగుండ ప్రవేశించి వానియందలి మూలపదార్థపు ముద్దలతో నైక్యమగును (B. చూడుము). ఇట్లీ రెండుపోగులయందలి సంయోగుల యొక్క ఐక్యముచే గలిగిన ఫలితమునకు సంయుక్తబీజము (Zygote) అనిపేరు (B-లో స. బీ. చూడుము). సంయోగుల జీవస్థానములు రెండును మిశ్రమై యేక జీవస్థాన మేర్పడునని కనిపెట్టబడినది. సంయుక్తబీజము తన చుట్టును దళమైన కణకవచము నేర్పరచుకొని కొంతకాలము విశ్రాంతి జెందును (D1. చూడుము).

స్త్రీపురుషవివక్షత.

పసిరిక పోగునందు సంయోగులు రెండు నొకటే యాకారమును, సమపరిమాణమును గలవిగా నున్నవి. కాని యందొక సంయోగి చురుకుగ పనిచేయునదియు, రెండవది మందముగనుండు నదియుగా నున్నవి. సంయోగవిధానమంతటిని చురుకుగ పనిచేయు సంయోగియే నడపుచున్నది. కాని యిందు స్త్రీపురుషవివక్షత