ఈ పుట ఆమోదించబడ్డది
ప్రతిపోగును అనేక కణముల కూర్పుచే నేర్పడిన సరముగా గ్రహింపనగు.
3. ఇందు తామరబీజములు తలవెంట్రుక లోపలను వెలపలను గూడ ఆక్రమించి యున్నవి.
4. తామరయొక్క పోగులును బీజములును తలవెంట్రుకలోపల నిమిడి యున్నవి.
ఈ తామరనుగూర్చి వివరముగ తెలిసికొన గోరువారు మాచే వ్రాయబడిన చర్మవ్యాధుల గూర్చిన వ్యాసముల జదువనగును.