ఈ పుట ఆమోదించబడ్డది
పోగులవంటికణముల పంక్తులచేనేర్పడిన యల్లికలుగా గ్రహింపనగు. పటములోని పెద్దగొడుగుయొక్క అధస్తంతువుల యల్లిక జూడుము.
శోభి; తామర.
కొందరి శరీరములమీద వ్యాపించియుండు శోభి, తామర మొదలగు చర్మ వ్యాధులు బూజుపోగుల బోలియుండు యొకానొక విధమైన శిలీంధ్రములచే నేర్పడియున్నవి. క్రిందిపటము చూడుము.
ఇందు 1. శోభిని కలుగజేయు బూజుపోగుల అల్లికలు.. అందు గుండ్రముగనుండు బీజములు అక్కడక్కడ చిమ్మబడియున్నవి చూడుము.
2. తామరపోగుల అల్లికలు. అందు నొక్కొకపోగుమీద పేప చెత్తపు కట్లవలె అక్కడక్కడనుండు అడ్డుగీట్లు చూడుము. ఈ గీట్లు పోగులయందలి వేర్వేరుకణముల నిరూపించు సరిహద్దుగోడలు.