పుట:Jeevasastra Samgrahamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1°C భాగము మొదలు 43°C భాగములవరకు వృద్ధిబొందును. .కళపెళలాడెడు 100°C నీళ్లచే నైనను చావదు. రెండువత్సరములు నిలువయుంచినను తిరిగి మొలచును. మనము మిక్కిలి శ్రమపడి జాగ్రత్తగా నిలువయుంచిన వస్తువులకుగూడ సామాన్యముగా బూజు పట్టుచుండుటకు కారణము లిప్పుడు బోధపడగలవు.

కుక్క గొడుగులు.

మనము చదివిన బూజు తుట్టెలు రూప నిర్ణయములేక ఏపాత్రమునందు మొలిపించిన నాపాత్రముయొక్క ఆకారమునే చెందును. కాని కొన్నిజాతుల బూజులు ప్రత్యేక ఆకారముగలవి గానున్నవి. ఆయావిత్తనముల జల్లినయెడల ఆయారూపములే పుట్టును. ప్రక్క 13-వ పటమునందు జూపబడిన కుక్కగొడుగు మొదలగు కొన్ని ప్రాణులు ఈ జాతిలోనివియే. ఒక కుక్కగొడుగునుండి ఒక చిన్న తునకను సూదులతో చీల్చి పరీక్షించినచో బూజుపోగులవలె నుండు పోగుల యల్లిక స్పష్టపడగలదు. ఇట్టినిర్మాణములన్నియు బూజు