ఏడవ ప్రకరణము
బూజు, కుక్కగొడుగు (Penicillium and Agaricus}
లైపిండి, తోళ్లు, లేతకొబ్బరిముక్కలు మొదలుగాగల జీవజ పదార్థముల నిలువయుంచినప్పుడు వానిపై నొకవిధమైన తెల్లని బూజు కట్టుట మనమందర మెరిగినదియే. ఇది వృక్షజాతులలో నొకటి. ఇదియును, మన మీవరకు జదివిన మధుశిలీంధ్రమును, కుక్కగొడుగులు మొదలగునవియు శిలీంధ్రములను (Fungi) నొకజాతిలోనివి. ఈ బూజు నొకవ్రేలుతో గీచి ఎత్తినయెడల మిక్కిలి మృదువైన కొంచె మాకుపచ్చని వర్ణముగల ధూళి యావ్రేలి నంటియుండును. ఈధూళియే బూజుమొక్కయొక్క బీజమని ముందు తెలిసికొనగలము. ఒక చీపురుపుల్లతో బూజు పట్టిన పదార్థముమీదనుండి కొంచెము బూజు నెత్తి పాస్ట్యూరు రసములో చల్లుము. తరువాత నా నీటిని చక్కగ కలుపుము. మనము విస్తారము బూజును తీసికొనక కొంచెముగా నుపయోగించినయెడల నది నీళ్లలో లీనమై వట్టికంటి కెంతమాత్రమును కానరాదు. దానిని కొద్దిరోజులు నిలువజేయు నెడల నా నీటి యుపరితలమున తెల్లని చుక్కలు కనిపించును. ఇవి క్రమముగా పెద్దవై భూత అద్దపుబిళ్లతో (Hand lens) పరీక్షించు