నెడల స్పష్టముగా తెలియుచుండును. ఈచుక్కలు వలయాకారము గలవై మధ్య మిట్టగను చుట్టును క్రమముగా పలుచగను ఉండి నీటిమీద తేలుచుండును (12-వ పటములో A-చూడుము). ఇట్లు తేలుటచే వాని పైతట్లుపొడిగా నుండును. ఈ గుంపులలో నొక్కొక టొక బూజుతుట్టె. ఈ తుట్టెలు క్రమముగా పెరుగుచు వైశాల్యమున హెచ్చుచుండును. ఇట్లు పెరుగుచుండునప్పుడు ఈ తుట్టె చుట్టును ఏటవాలుగను, మధ్య మిట్టగను పెరుగును. పిమ్మట దీని మధ్యభాగము క్రమముగ బొంతు రేగినట్లుండి తుట్టె 10 నూళ్ల (నూలు అనగా అంగుళములో 12-వ వంతు) వెడల్పు గలదగునప్పటికి, చుట్టునుండు తెల్లనిభాగముకంటె మధ్యభాగము కొంచెము నీలవర్ణము గలదగును. 20 నూళ్ల వ్యాసమువరకు తుట్టె పెరుగునప్పటికి దాని మధ్యభాగము ఆకుపచ్చ నగును. ఇట్లు తుట్టెమధ్యను ఆకుపచ్చని చుక్కయు, చుట్టును నీలమైన పట్టెవంటిభాగమును, దాని వెలుపలితట్టున తెల్లని అంచును, మూడువరుసలుగ లోపలి నుండి వెలుపలికి ఆకుపచ్చన, నీలము, తెలుపు ఈ రంగులు వరుసగా కనిపించుచుండును. కొంతకాలమున కీ తుట్టె లన్నియు నొక దానితో నొకటి యలుముకొని యేకపొరగా నేర్పడును గాని చిన్న తుట్టెల సరిహద్దులు గుండ్రని తెల్లనిరేఖలవలె తెలియుచుండును.
పుట:Jeevasastra Samgrahamu.pdf/157
Appearance