పుట:Jeevasastra Samgrahamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమృద్ధియు, స్వరాజ్యమును ఉండినచో ప్రజలకు ఎట్టిలోపములును లేక, అందరును ఒక్కచో గలసి యుండుటవలన తమ ఐకమత్యబలముచేత తమశత్రువులనుండి తమ్ము రక్షించుకొనుటకు మరింతశక్తి గలిగియుందురు.

అట్లుగాక విడువనిక్షామముల పాలబడి, వరుసగా చిరకాలమునుండి పరరాజులచే జిక్కి కష్టములను అనుభవింప వలసి వచ్చినప్పుడు, అఖండావర్తకారియొక్క బిడ్డలవలెనే ఎల్లవారును ఒక్కసారిగా నశింపవలసి వచ్చునుగదా !

మొదట వ్రాయబడిన ద్విఖండవిధానమున విభాగమైన తోడనే విడిపోయి స్వతంత్రముగ జీవించు శక్తిగల ఆవర్తకారులలో క్షామాదిబాధ లుండనే యుండవు. ఒక్కొకచో నట్టివి సంభవించినను ఏవో కొన్నిపిల్లలే అనుభవించునుగాని, ఒక్క సంతతిలోని ఆవర్తకారుల కన్నిటికిని ఒక్కసారిగా అంతము గలుగనేరదు.