పుట:Jeevasastra Samgrahamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంపట్టుటచేత నీపోగు పట్టయొక్క పూర్వభాగమేయని చెప్పవచ్చును.

ప్రేరిత సంకోచనము

ప్రేరిత సంకోచనము (Irritability):- అనగా బాహ్యమైన ప్రేరేపణకు జవాబుగా సంకోచించుటకు సిద్ధముగా నుండుట. ఇది ఆవర్తకారియొక్క గుణములలో ముఖ్యమైనది సూక్ష్మదర్శని యందలి మూత అద్దము (Coverglass) యొక్క స్వల్పమైన తాకుడునుగాని, ప్రక్కల నీదుచుండు ఇతర జంతువులయొక్క స్పర్శమునుగాని ఆవర్తకారి అతి మెలకువతో గ్రహించి తత్క్షణమే ముడుచుకొనును. అప్పుడు దాని కాడయందలి నడిమి పోగుయొక్క మెలికలు దగ్గిరపడుటచేత నది మొదటిపొడుగులో వీసమంతటి ప్రమాణమును లేనిదగును. గిన్నెవలె నుండు దేహము గుండ్రనై, మూతబిళ్లను లోపలి కీడ్చుకొని అంచులచే దానిని మూసిపట్టును. పటములో A. యొక్క అడుగుభాగమునకు ఎడమప్రక్కనున్న ఆకారమును చూడుము.

మాంసాంకురము.

చూపునకు కనబడియు కనబడకుండునంత చిన్నదియై మినుకు మినుకు మను ఆవర్తకారియందు మాంసపుకండ గలదని వ్రాసినచో జదువరులకు చిత్రముగా దోచును కాని దీనియొక్క సంకోచ వికాసములు కండసంబంధమైనవి అనుటకు సందియము లేదు. పూర్తిగా నిగిడి యున్నప్పుడు కాడ సూటిగ నుండునని చెప్పియుంటిమి. కాని దాని నడిమిపోగు సూటిగ బోవక పెద్దపెద్ద