సుడిగుండ్రమునకు జలావర్తమని పేరు. దీనిని కలుగ జేయు జంతువునకు ఆవర్తకారి యని పేరు. ఈ సుడిలో బడి కొట్టుకొనివచ్చు ఆహారపదార్థము లొక నీటిబొట్టులో నిమిడి నోటిగుండ కంఠములోనుండి మూలపదార్థములోనికి ప్రవేశించును. ఈ యాహారపదార్థమును దానిని చుట్టియుండు నీటిబొట్టును గలసి మూలపదార్థములో నాక్రమించియుండుస్థలమునకు ఆహారావకాశములని పేరు (B-లో ఆ. అ). ఈ యాహారావకాములు మూలపదార్థపు దవ్వ (Medulla) లో చుట్టిచుట్టి తిరుగుచు జీర్ణముకాగా మిగిలిన యజీర్ణ పదార్థములను గొంతుగొట్టమునకు అడుగుననున్న అపానద్వారామను రంధ్రమున వెలువరించు చుండును.
కాడయని చెప్పబడు మొదటిభాగము మిక్కిలి మృదువుగను స్వచ్ఛముగను ఉండును. గిన్నెకు కవచముగానుండు పైపొర యీకాడ అడుగువరకును వ్యాపించి దానికిగూడ కవచముగా నేర్పడుచున్నది (A. B. లలో పైపొర చూడుము). ఈ కాడ నిగిడియుండుసమయమున వంకర లేమియు లేక సూటిగ నుండును. దానియందు మిక్కిలి సన్నని నారపోగువంటి దార మొకటి కొంచెము మెలికలుతిరుగుచు మొదటినుండి చివరవరకు వ్యాపించి నడిమిపోగు అనదగియుండును. శేద్ధగా శోధించునెడల ఆ పోగునందు అతి సూక్ష్మమైన అడ్డ చారలు కానబడును. ఇవి గిన్నెయందలి పట్టలోనుండు చారలవరకు ఎడతెగక వ్యాపించి వానితో సంబంధము గలిగియున్నట్టు