Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుశిలీంధ్రము మధ్యమజాతిజీవి-దాని ఆహారము పూతికాహారము.

పై జెప్పబడిన పదార్థములన్నిటిని ద్రవరూపమున సమకూర్చినగాని మధుశిలీంధ్రము తిననేరదు. ఏలయన, ఘనపదార్థములు దాని కణకవచముగుండ లోపలికి పోలేవు. అందుకొరకే పాస్ట్యూరు అనునతడు వీనినన్నిటిని జేర్చి కషాయముగా జేసెను. ఇది జంతుజాతిజీవులవలె మాంసకృత్తుల (Proteids) తిన లేదు. వేక్షజాతిజీవులయందువలె వీనియందు హరితకములు లేవు. కాన లఘునత్రితముల (Simple Nitrates) నిది యుపయోగపరచు కొననేరదు. ఇది కోరునట్టి మధ్యతరగతి నత్రితములుగల (Inter-mediate Nitrates) యాహారమును బట్టిజూడ దీనిని మధ్యమజాతిజీవి యని చెప్పనగు. దీని యాహారము పూతికాహారము (Saprophytic Nutrition) అని చెప్పనగును (50-వ పుట చూడుము).

మధుశిలీంధ్రమున కనుకూలమైన స్థితిగతులు.

శీతోష్ణపరిమాణము 28°C-34°C భాగములలో నున్నప్పుడు, ఇవి మిక్కిలి చురుకుగ వృద్ధిబొందును. క్రిందిభాగములలో నున్నప్పుడివి మందగతి నొందును. 38°C భాగములవరకు వేడిమి హెచ్చునప్పటికి సంతానవృద్ధి నిలచిపోవును. 100°C భాగములు గలనీటిలో అనగా పొంగునీళ్లలో నీ కణములు చచ్చును. మధుశిలీంధ్రకణములుగల ద్రవపదార్థములు పొంగునీళ్లలో కొంతకాల ముంచిన తరువార దానిని పాస్ట్యూరురసములో కలిపిన ఆరసమునందుండు