చక్కెర సారాయిగా మార్పు నొందదు. కాన చచ్చినకణములందు చక్కెరను సారాయిగా మార్చుగుణము లేదనియు అట్టి గుణము బ్రతికియుండు మూలపదార్థమునకే కలదనియు స్పష్టము. ఈమధుశిలీంధ్ర కణములు తమ మూలపదార్థ నిర్మాణమునందు ఆదాయవ్యయములు సరిపుచ్చుకొనుచు, తమ కునికిపట్టగు చక్కెర నీటియందు మితిలేని మార్పు గలిగించుచున్నవి. అట్లు జేయుటలో తాము లేశమైనను మార్పునుగాని క్షయమునుగాని బొందుట లేదు. అనగా లేశ మాత్రమైన మధిశిలీంధ్రకణములు తాము వ్యయప్రయాసముల నొందకయే తమ ప్రమాణమునుబట్టి పోల్చి చూడ తమకంటె యనేక వేల రెట్లధికమైన చక్కెరనీటియందు మితిలేని మార్పును గలుగ జేయును.
విభేదకములు.
ఇదేప్రకారము తా మీషన్మాత్రమైనను వ్యయము చెందకయే, తమనివాసములగు పదార్థములలో విచిత్రమైన మార్పులను అమితముగ గలిగించునట్టి యజీవపదార్థములును కొన్నిగలవు. ఇట్టి విభజనశక్తి యనంతముగ గల పదార్థములకు విభేదకములు (Ferments) అని పేరు. పైని వివరింపబడిన మధుశిలీంధ్రము (Yeast) సజీవ (Living Ferments) విభేదకము. అజీవ విభేదకములను (Non-living Ferments) కొన్నిటి నీక్రింద వివరించెదము.
1. జాఠరకము (Pepsin):- ఇది మన జీర్ణాశయములోని జాఠరరసము (Gastric Juice) నం దుండునది. ఇది మనము తిను