పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనగా చదువు చెప్పేవారుండరు. తానేమి చేయ వలెనో వానికీ తోచదు. అందు చేత అతడు తన పనిమీన శృద్ధవహించక,, సంఘములలోను, వినా దములతోను కాలయాపనము చేసి, ఒకటి రెండేళ్ళు కాగా నే మరొక విశ్వవిద్యాలయానికి పోయి., . శ్రద్దగా చదువుకోవడ మారంభిస్తాడు .ఈ వృధా కాలక్షేపమును గురించి జర్మను అధ్యాపకుల కంద రికీ తెలుసును. గాని, వారు దానిని ఆటంక పెట్టడానికి ప్రయత్నించరు. విద్యార్థులు తమ స్వాతంత్ర్యభంగమును సహించరని వారికి తెలుసును. యుద్ధమయిన తరువాత ఈ విషయమై రెండు పద్ధతులను ఆలోచిస్తున్నారు.

(1) ఉన్న తపాఠశాలలకున్ను , విశ్వవిద్యాలయాలకున్ను మధ్యగా ఇంటర్మీడి యేటు కళాశాలలను ఏర్పాటు చేయడము. ఈ కళాశాలలలో తరగతులలో పాఠాలు జరుగుతూఉన్నా విద్యార్థులకు కొంచెము స్వాతంత్ర్య ముంటుంది. ఈ కళాశాలలలో రెండేళ్ళు చదువవలెననిన్ని, వాటిలో ఒకయేడు హైస్కూలు విద్యాక్రమమున్ను, రెండో

89