పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ జర్మను వైద్యవిద్యాలయాలకు వస్తారు. వారి కోసము ఇంగ్లీషులో కూడా ఉపన్యాసా లిస్తారు. అమెరికావారు ఇంగ్లీషుమాట్లాడేవారికి జర్మను వైద్య విద్యను గురించిన భోగట్టా తెలుపడానికి ఒక సంఘము స్థాపించినారు. ఈ సంఘమునకు “ఆమె రికర్ మెడికల్ ఎసోసియేషన్ (American Malli R! Association) అని పేరు. దీని విలాసము 9, ఆల్సాక్ స్ట్రస్సై, ఫియెన్నా 9. Alsac StrasseVienna . )

జర్మను విశ్వవిద్యాలయాలలో తరగతుల & భాగము గాని, ఫలానా ఉపన్యాసాలనే నియమము గాని లేవు, ఇందు చేత చాలా గందరగోళముగానే ఉంటుంది. ఉన్న తపాఠశాలలో తరగతి అయిన తరువాత తరగతి చదువుకొంటూ, ఒక పాఠక్రమ ము ప్రకార ము శిక్షణ ముపొంది, పరీక్షలు ప్యాసవు- తూ వచ్చిన విద్యార్థి, విశ్వవిద్యాలయములో ప్రవేసించగానే స్వతంత్రు డయిపోయి, దిక్కు దెస లేకుండా అధ్యాపకుల సహాయము లేక తనంతట తానే చదువుకోవలసి వస్తుంది, దీనికి “ట్యూటర్లు

88