పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/94

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోయే ప్రతి ఇంగ్లీషువాడున్ను తన స్వానుభవము సుపయోగించి ఆ రాజ్యములోని వ్యవసాయమును, ఇతర విషయాలను అభివృద్ధి చేసుకోవలెను. పైని చెప్పిన జర్మను కళాశాలలన్ని టిని మూల ప్రభుత్వము వారే పోషిస్తారు.

వైద్యములో పట్టభద్రులు కావడానికి ఆ రేళ్ళు చదువుకోవలెను. 'రెండోయేడు ఆఖరున ఒక పరీక్ష జరుగుతుంది. తరువాత విద్యార్థులను ఆసు పత్రులలో పని చేయడానికి పంపు తారు. యూరో పు ఖండములోనేకాక. ప్రపంచ మంతటి లోను పెద్దదయిన వైద్య విద్యాలయము జర్మనీలోని “ఫియెన్నా” (Vienna) పట్టణములో నున్నది. దీనికి సంబంధించిన ఆస్పత్రులలో 20,000 రోగు లకు మంచములున్నవి. ఈ వైద్యవిద్యను రాక్" ఫెల్లర్ (Rockfeller) అనే అమెరికా కోటీశ్వరుడు ప్రపంచములో వైద్య సహాయముకోసము నిధిగా ఏర్పరచిన సొమ్ముతోనే చాలాభాగము జర్మనీలో సాగిస్తున్నారు. ఇంగ్లీషు మాత్రము తెలిసే గ్రాడ్యుయేట్లు ఇంకా ఎక్కువగా నేర్చుకొనడానికి

87