పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ విషయములో గొప్ప పేరుప్రతిష్ఠలను సంపాదింవచిన అధ్యాపకులనే అందులో నియమిస్తారు. ఏ విషయము ఏ విశ్వవిద్యాలయములో ఎక్కువ గా బోధిస్తారో " మై నెర్వా” అనే పుస్తకములో గాని “ఊహాక్ షూలెన్ డోయ్ ష్ లాండ్ " అనే పు స్తకములో గాని ఉంటుంది. ఈ రెండో పుస్తక మును డాక్టరు రోమ్మె అనే ఆయన వ్రాసినాడు. ఇతని పై విలాసము, డైరెక్టర్ ఆఫ్ పారిస్ ఇన్ఫర్ మేషన్స్, 4 ఉంటర్ - వెస్-లిండెస్ ,బెర్లిను(Dr. Romme, Director of Forign Infour- mations, 4, Unter-den-Lindon, Berlin. Germany) ఆయనకు వ్రాస్తే పుస్తకము చిక్కుతుంది.

పైన తెలిపిన 49 విశ్వవిద్యాలయాల లోను డాక్టరు బిరుదము నిస్తారు. కొన్ని విషయములలో, అనగా మతము, ఇంజనీరింగు, వ్యవసాయ ము, వాణిజ్యములలో ఇంట్మడియేటు పరీక్ష ఒక టి ఉంటుంది. ఇది ఇంగ్లాండులోని బి.యే, పరీక్ష కున్ను బి. ఎస్. సి. పరీక్షుకున్ను, ఫ్రాన్సులోని

85