పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలిగి ఉంటుంది. జర్మనీ దేశము జనసంఖ్య ఆరు కోట్ల ఇరవై అయిదు లక్షలు, అంటే ఇండియా జన సంఖ్యలో - అయిదో భాగము. ఈ జనసంఖ్యకు 49 విశ్వవిద్యాలయాలున్నవి. వీటిలో 28 లో సాధారణ విషయాలు బోధిస్తారు. పదిం టిలో ఇంజినీరింగు చెప్పుతారు.నాలుగింటలో ప్రత్యేకముగా వ్యవసాయమే నేర్పుతారు. డింటిలో పశుకోగచికిత్సను గురించిన్ని ఏడింటిలో అడవులను గురించిన్ని, అయిదింటిలో వాణి జ్యమును గురించిన్ని చెప్పుతారు. ఈ 40 విశ్వవిద్యాలయాలలోను 113,657 మంది విద్యార్థులున్నారు. వీరిలో 8,824 మంది పర దేశీయులు, ఇండియా దేశపు విద్యార్థులు 67 గురు: ఉపాధ్యాయుల సంఖ్య 7,489. వీరిలో 2,441 మంది అధ్యాపకులు (Professors) స్త్రీ విద్యార్తి నుల సంఖ్య వేగముగా అభివృద్ధి చెందుతున్న ది. ప్రతి విశ్వవిద్యాలయములోను అన్ని విష యాలను బోధించినా, ఒకొక్కటి ఒకొక్క విష యమును గురించి ఎక్కువ శ శ్రద్ధ తీసుకొంటుంది.

84