పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“లెసెన్సు” పరీక్షకున్ను సరిపోతుంది. ఇంజనీ రింగు కళాశాలలలో ఈ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. విద్యారులు ఏకార్మిక శాఖలో ఎక్కువ కృషి చేయవ లెనో సలహా ఇవ్వడమునకు న్ను, ఒక సంవత్సరము అనుభవము పొందడానికి ఆ యా ఫాక్టరీలవారి నడిగి విద్యార్ధులను పంపడ ముడున్న, ప్రతి ఇంజనీంగు కళాశాలలోను ఒక ప్రత్యేక శాఖ ఉంటుంది. ఇంజనీరింగు పరీక్షలో కృతార్తత పొందడానికి ఈ అనుభవము అవసరము. జర్మనీవారి కిప్పటికిన్ని ఒక టైనా వలస దేశము(en..........) లేకపోయినా,viట్సెస్ హౌసెస్ (Witsen ...........) అనే పట్టణములోని వలసకళాశాలను (........ college) సాగిస్తూనే ఉన్నారు. ఈకళాశాలలో., - 2000 మంది విద్యార్థులున్నారు. దీనిలో ఇతర విషయాలతోపాటు వృక్ష శాస్త్రము, వ్యవవసాయము, దేశములోని పంటలను వద్ధి చేసే విషయాలున్నూ, నేర్పు తారు, ఇంగ్లీషువారికి ఎన్నో వలస రాజ్యాలున్నావారికిటువంటి కళాశాల లేక పోవడము విచిత్రముగా నున్నది. వలస రాజ్యలకు

86