Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పనిచేసిన కొందరు ఉసాధ్యాయులు పాఠముల మీద ఎక్కువశ్రద్ధ చూపవలసినదని అభిప్రాయ పడి, తమ స్వంత వసతిబడులను ఏర్పాటు చేసు కొన్నారు. ఈ పబ్లికుబుడులవల్లనే ఇంగ్లీషు వారు ఎక్కువ రాజనీతిజ్ఞులయినారనిన్ని, అవి లేకపోవడ ము చేత జర్మనులలో రాజనీతి మందగించినద నిన్ని జర్మను లనుకొని, ఈ పాఠశాలలను ఎక్కువ ప్రో త్సాహషర చడ మారంభించినారు. ప్రస్తుతము జర్మనీ లో విధ్నాలుగు పబ్లికు వసతిబడులున్నవి. ఇవన్నీ ప్రయివేటు బడులే. కొన్ని టికి మాత్రము ప్రభుత్వములవారు నామకా గ్రాంటు లిస్తున్నారు. పిల్లలు చెల్లించే జీతములమీద నే ముఖ్యముగా ఈ బడులు నడుస్తున్నవి. ఈబకులలో ఒకటి ఈ క్రింద వర్ణింపబడినది.

ఈబడికి అధికారవర్గమువారు పెద్ద పట్టణా లలో ఉండే ఆరుగుకు ధనవంతులనుంచి ఎంచుకొం టారు. వీరు సాధారణముగా సంవత్సరమున కొక సౌరి కలిసి, బడి నడుపవలసిన పద్ధతి, బడికి కావలసిన కొత్తగృహములను నిర్మించడము, కొత్త బోధన

72