పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషయములను బడులలో చేర్చడము, మొదలయిన వాటిని గురించి ఆలోచిస్తారు. ప్రధానోపాధ్యా యుడున్ను , ఖాయము ఉపాధ్యాయులలో ఎక్కువ అనుభవము గలవారున్ను , బడి నిత్య వ్వవహారా లను చూచుకొంటారు. ప్రధానోపాధ్యాయులను చిన్న చిన్న ఖాళీలు పడినప్పుడు ఉపాధ్యాయులను తానే నియమించవచ్చును గాని, ఉపాధ్యాయు లలో ఎవరినైనా ఖాయము చేయడానికి, సీనియరు ఉపాధ్యాయుల సమ్మతి కానలసిఉంటుంది, ఇంగ్లీషు పబ్లికు బడులలోవలె ఈబడి ప్రధానోపాధ్యాయుని కి సర్వస్వాతంత్ర్యము లేదు. ఇతనికి అధికార వర్గము వారు చిన్న చిన్న విషయాలలో తొందరలు కలిగించరు.

ఈబడిలో 190 మంది విద్యార్థు లున్నారు, వారు నాలుగు వాయిదాలలో సంవత్సరమునకు 10 పౌనులనుండి 120 పౌనుల వరకు జీతములు చెల్లిస్తారు. క్లాసు లనుబట్టి జీతములుకూడు ఎకువ అవుతవి. కొంతమంది బీద బాలురను తక్కువ జీతాలమీదకూడా చేర్చుకొంటారు. ఈ బడికి

73