పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోవడమునకున్ను , నిరాడంబర జీవనము చేయడ మునకున్ను అలవాటు పడు తారు.

అధ్యాయము 10

.

జర్మనీలోని పబ్లికువసతి పాఠశాలలు

.

( లాండ్ షుల్ హేమ్ landschulheim. )

కిందటి శతాబ్దము అంతమున డాక్టరు లీట్సు అనే ఆయన ఇంగ్లాండులోని విద్యా పద్ధతి మీద ఉత్సాహముచూపి “లాండ్ షుల్ హేమ్” అనే పేరుగల మూడు వసతి బడులను స్తాపించినాడు. వాటిలో ఒక టి చిన్న పిల్లలకున్న, రెండోది ఈడు వచ్చిన పిల్లలకున్ను, మూడోది మధ్య వయస్సు పిల్లలకున్ను, ఉద్దేశింపబడ్డవి. చిన్న పిల్లల వసతి బడి ఇంగ్లాండు లోని వసతి ప్రారంభ పాఠ శాలల కున్ను, తక్కిన రెంనున్ను ఇంగ్లీషు పబ్లికు పాఠశా లలలోని రెండు భాగములకున్న సరిపోతవి. వీటిలో క్లాసు చదువు తక్కువగాను, ఆటలు, వ్యాయా ఎక్కువగాను ఉంటవి. ఈ బడులలో

71