పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాచక పుస్తకములు తప్ప తేక్కిన అన్ని విషయాలను బోధించడము ఉపాద్యాయులకే వదిలి పెట్టుతారు. నిర్బంధ విషయాలను నేర్చుకొనడానికి వారమునకు 30 నుంచి 33 గంటలున్ను, ఐచ్చిక విషయాలకు వారమునకు 15 కంటలున్ను ఉంటవి. బడులు ఉదయము 5-30 గంటలున్ను మద్యాహ్నము 2 గంటలున్ను పని చేస్తవి. సంగీతము, చేతి పనులు, ఐచ్చికవిషయములే అయినా సాధారణముగా అందరు పిల్లలున్ను వాటిని తీసుకొంటారు.

ప్రతి ఉపాధ్యాయునికిన్ని వారమనకు 25 గంటలు పని ఉంటుంది. ఏదో ఒక్క విషయమే కాక ఎక్కువ విషయాలను కూడ వారు బోధించ వలసి ఉంటుంది. విశ్వవిద్యాలయాలలో తప్ప క్రింద బడులలో ఉపాద్యాయుడేదో తన అభిమాన అవిషయములో పాఠము చెపవలెననే నియమము లేదు. ఒకొక్క పీరియడ్డు 55 నిముషములుంటుంది. ఒక క్లాసులో నుంచి మరియొక క్లాసులోనికి పోవడానికి 5 నుముషములు గడువుంటుంది. ఆటల కోసమని కొన్ని పీరియడ్డులు 45 నిమిషాలె ఉంటవి.

62