ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆధ్యాయము 9
జర్మనీలోని ఓక మంచి ఉన్నత పాటేహశాల వర్ణనము
(గెటింజన్ పట్టణములోని ఓబర్ రియల్ షూలె.
ఈ బడిలో రియల్ జిమ్నేసియం బడిలోని పాఠక్రమమున్ను, ఓబర్ రియల్ షూలె లోని పాఠక్రమమున్ను ప్రత్యేక ప్రత్యేక తేరగతులలో నేర్పుతారు. ఇందులో 650 విద్యార్దులున్నారు. 23 ప్రత్యేక క్లాసులున్నవి. ఉపాధ్యాయల సంఖ్య 30; అందు చేతే 20 మంది విద్యార్థుల కొక ఉపాధ్యాయు డున్నాడన్నమాట. క్రింది తరగతులలో ఒకొక్క దానిలో 50 విద్యార్తులున్నారు. బడికయ్యె మొత్తము ఖర్చు 12500 పౌనులు. దీనిలో ఇంచు మించు సగము విద్యార్థులు జీతములవల్ల వస్తుంది. ఉపాధ్యయుల జీతాలు సంవత్సరమునకు 250 పౌనలనుంచి 500 పౌనులవరకు ఉన్నవి. ప్రథానోపాధ్యాయునికి డైరెక్టరని పేరు. ఇతనికి ప్రత్యేకముగా ఎక్కువ జీతము లేదు. సాధారణ ఉపాధ్యాయుని జీతేమే అతనికిన్ని ఇస్తారు. డైరక్టరు పనిని చూడడానికి
63