పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లను తామే చేసుకొంటారు. కొన్ని స్థలాలలో ఉపాద్యాయులు సొమ్ము పుచ్చుకొని విద్యార్థులకు అన్నము పెట్టుతారు. కొన్ని ప్రయివేటు స్కూళ్ళు మాత్రము ఇంగ్లీషు వసతి గృహములు మోస్తరుగా ఉంటవి. ఇవి కేవలము ప్రయివేటు బడులే; వీటికి ప్రభుత్వము వారు గ్రాంటులిస్తారు. ఇంగ్లాండులో వలే వసతి గృహములతో కూడిన పాఠశాలలు లేక పోవడము చేతనే యుద్ధములో తామోడియినామని జర్మనుల ఆభిప్రాయము. ఇంగ్లీషు పబ్లికు స్కూళ్ళలో విద్యాపద్ధతులను తెలుసుకోవ డానికి చాలమంది జర్మను విద్యానుభగ్నులు పోయినారు గాని అవి చాల డబ్బు ఖర్చుతో కూడివవని అట్టి స్ఖూళ్ళను తమ దేశములో ఏర్పాటు చేయ్తవలెననే అభిప్రాయమును వదులుకొన్నారు. విద్యా మంత్రి శాఖవారే ఆయా విధముల ఉన్నత పాఠశాలలకు తగినట్లు పాఠ క్రమములను వ్రాసి, ఏవిషయము ఎన్ని గంటలు చెప్పవలెనో నిర్ణయిస్తారు. జర్మను భాషా వాచకపుస్తకములు ఇతర యూరిపియను భాషా

61