పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మండలములోని పల్లెటూరి బడులన్నీ అతని పరిపాలనములో ఉంటవి. ఒకానొక మండలములో 75 పల్లెటూళ్ళున్నవి. వాటిలో జనసంఖ్య 40,000 ఉన్నది. వీటిలో ప్రతి పల్లెటూరికి ఒక బడి ఉన్నది. ఈ బడులలో నిర్బంధముగా వయస్సు పధ్నాలుగేండ్ల వరకు చదువు చెప్పుతారు. కొన్ని బడులలో ఒకొక్క తరగతికి, ఒక్కడే ఉపాధ్యాయుడు ఉంటాడు. పిల్లల సంఖ్య అరవైకి పైబడితే మరి ఒక ఉపాద్యాయుడిని నియమించవచ్చును. ప్రస్తుతము పిల్లల సంఖ్య ఎక్కువగానే ఉన్నది కాని, దన లోపము చేత అంతకంటె తక్కువ మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయడానికి వీలు లేకున్నది. (కొన్ని దేశాలలో ఒక్కడే ఉపాధ్యాయుడుండే బడులలోని పిల్లలను రెండు తండాలుగా విభాగించి, ఒక తండావారికి సోమ, బుద, శుక్ర వారములలోను, రెండోతండావారికి మంగళ, గురు, శని వారములలోనున్ను చదువు చెప్పుతారు.) జర్మినీలో ఒక బడిలో 62 పిల్లలు కూడా ఉన్నారు. ఒకొక్క మండలమునకు ముగ్గురు వైద్యులున్నూ,