ములను పశువుల మేత బీళ్లుగా మార్చుకొంటారు. అందు చేత పల్లెటూళ్ళ జనము క్రమక్రమముగా పట్టణాలలోనికి వచ్చేస్తున్నారు. కాని, జర్మినీలో అట్లు కాదు. జర్మనులకు వ్యవసాయము లాభకరముగా ఉన్నది. జర్మనులకు వ్వవసాయము లాభకరముగా ఉన్నది. వ్వవసాయదారులకు తమ పనికి అంటి పెట్టుకొని ఉండడమే ఇష్టము. పూర్వము జంతువులనుంచి మాత్రమే తయారయ్యే చాల వస్తువులను జర్మనులు వృక్షములనుంచి కూడ తయారు చేయడము నేర్చుకున్నారు. అందు చేత వారు ఆడవులను పెంచడములో ఎక్కువ శ్రద్ద వహించి ఎంతో అభివృద్ది పొందినారు. అనేక జర్మను విశ్వవిద్యాలయాలలో అడవి శాఖలను ఏర్పాటు చేసినారు. ప్రత్యేక వ్వవసాయ కళాశాలలను అభివృద్ధి చేసుకొన్నారు. పరిశోధనల కోసము లెక్కలేనన్ని పొలములు లేచినవి. ఆరేసి గ్రామములకు ఒక్కొక్క పరిశోధన క్షేత్రమున్నది. జర్మినీలో కొన్ని పల్లెటూళ్ళు కలసి ఒక గెమెండె అను పేరు కలిగి ఉంటవి. ఒకొక్క మండలమునకు ఒకొక్క స్కూళ్ళ ఇన్ స్పెక్టరు ఉంటాడు. ఆ
పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/54
Appearance