పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇద్దరు దంత వైద్యులున్నూఉంటారు. వీరు నెల కొకసారి ప్రతి బడికి పోయి తనిఖీ చేస్తారు. బడిలో ప్రవేశించేటప్పుడు, ప్రతి విద్యార్థినిన్ని వైద్యుడు సంపూర్ణముగా తనిఖీ చేసి, ఒక ఫారములో తాను పరీక్షించిన విషయాన్నిటినీ వ్రాసి ఉంచుతాడు.

వైద్యుడు ప్రతి బడిని నెలకొక సారి అయినా పరీక్షిచి, రోగములు గాని,అంగ వైకల్యము గాని గల పిల్లలను "హిల్ఫ్ షూలె " (hilf schule) అనేప్రత్యేక విద్యాలయానికి పంపుతారు. గ్రుడ్డి, చెవుడు, మూగ పిల్లకున్ను, రోగిష్టి పిల్లలకున్ను, మందమతులకున్ను, ప్రత్యేక పాఠశాల లున్నవి. ఈ పాఠశాలలో పూర్వము నిర్బంధ పాఠ క్రమము లేకుండెను గాని 1924 సం. ములో ఒకొక్క రీతి బడికి ఒకొక్కరీతి పాఠ క్రమమును విద్యాంగ మంత్రి ఏర్పాటు చేసినాడు. ఈబడులలో పిల్లలు ఎట్లు అభివృద్ది పొందుతున్నారో జాగ్రతగ కనిపెట్టుతూ వుటారు, జర్మినీ దేశములో మందమతులైన పిల్లలకోసమే కాకుండా అసాధరణ ప్రజ్ణగల పిల్లలకు కూడ ప్రత్యేక విద్యాలయములున్నవి.

49