పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములో మంచి పద్ధతులమీద నడుస్తున్నవి. ప్రతి మ్యునిసిపాలిటీలోను శిశు పోషణ శాఖ ఉంటుంది. ఇంగ్లాండులో ఈ పని ప్రభుత్వము వారు కాక, ప్రయివేటు సంఘములవారు చేస్తారు. శిశువు పుట్తగానే ఆసంగతి మ్యునిసిపాలిటీ వారికి తెలియ జేయవలెను. వెంటనే ఒక మ్యునిసిపలు దాది వచ్చి తల్లిదండ్రులు శిశువుకు సమకూర్చలేని సదుపాయములన్ని చేస్తుంది శిశువు అనాధయినా తల్లిగండ్రులు దానిని సరిగా చూడక హింసించినా, సరి అయిన ఆహారము, దుస్తులు లేక పోయినా, వెంటనే ఆ శిసువును ఒక శిశు పోషణ గృహమునకు (Nursing home) పంపుతారు. ఈ శిశుపోషణ గృహములలోని పిల్లలను దగ్గరా ఉన్న కింటర్ గార్టెన్ బడులకో ప్రారంభ పాఠశాలలకో పంపుతారు. ఆ పిల్ల తండ్రి, బ్రతికి ఉంటే, ఆశిశువు పోషణమునకు అతడు కొంత సొమ్ము ఇచ్చుకోవలెను. ఈ శాఖవారు ప్రారంభ పాఠశాలలలోని పిల్లల శ్రేయస్సును కూడా గమనిస్తూ ఉంటారు. బడికాలములో పిల్లలకు ఉచితముగా తిండి పెట్టడమే కా

45