పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/203

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్టోరీ పని బాగుగా తెలిసిన ప్రఫెసర్లనే నియమిస్తారు. అమెరికాలో •ఈ జర్మనుపద్ధతి నిప్పుడిప్పు డవలం బిస్తున్నారు.

అధ్యాయము 25

ముగింపు

యుద్ధమునకు పూర్వము జర్మనులకు సంస్థా నిర్మాణ విధానములో "పెట్టినది పేరుగా ఉండేది. వారి సైన్యపుఏర్పాటులు మిక్కిలి సూక్ష్మముగా ఉండేవి. రషియాతోగానీ, ఫ్రాన్సుతో గాని, యు ద్ధము సంభవిస్తే, ఏ సైనికుడెక్కడనుండి యుద్ధము చేయవ లెనో కూడా ముందుగానే ఏర్పాటు చేసు కొన్నారు. వా రేమేమిపనులు చేయన లెనో, ఏ రైలుబండి ఎప్పుడెప్పుడు బయలు దేరవ లెనో, ఏ బండిలో ఏ సైనికు డెప్పుడెక్కవలెనో, ఎక్కడకూ ర్చోవ లెనో, అన్నీ ఎంతో కాలము ముం దే నిశ్చయిం చుకొన్నారు. తామనుకోని పరిస్థితులు తటస్థించినప్పుడు వారేమేమి చేయవ లెనో మీది ఉద్యోగ

.

198