Jump to content

పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రఫెస రుంటాడు. అతనికింద పరిశోధన శాఖ ఉంటుంది. ఏరోజున బయలు దేరిన సమస్యలను ఆ రోజున ప్రఫెసరుకు తెలుపు తారు.వాటికి ఉత్త రములను కనుక్కొని చెప్పవలెనని అతను తన శిష్యులకు ప్రయోగిస్తాడు. విశ్వవిద్యాలయాలలో తనక్రింద పని చేసి డాక్టరు బిరుదమును పొందిన శిష్యులను ఈ ఫాక్టరీలకు పంపి అనుభవమును ఇస్తాడు. కొన్నాళ్ళయినతరువాత వారికి ఫాక్టొ రీలలో ఉద్యోగములు లభిస్తవి. చిన్న ఫొట్టొరీల లోని ఉద్యోగ స్థలందరున్నుప్రఫెసరు శిష్యులే అయి ఉంటారు. పెద్దఫాక్టోరీలలో ఒకొక్క శా ఖకు ఒకొక్క ప్రఫెసరుంటాడు.


ఈద్ధతివల్ల ఫాక్టోరీలకు విశ్వవిద్యాలయాలకు కూడా లాభముగా ఉంటుంది. అధ్యాపకులున్ను, వారిశిష్యులున్ను తమ పరిశోధనలను విడు వక ఆయా పరిశ్రమలను అభివృద్ధి చేసే దృష్టితో ఉంటారు. ఫాక్టరీలవారికి అత్యుత్తమ మైన సల హాలు లభిస్తవి. ఇంజనీరింగు కళాశాలలలోను అనుభవశాస్త్రములను బోధించడమునకున్ను, ఫా

195