పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/204

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థులు చెప్పు తే నేకాని, వారికి తెలిసేది కాదు. సూక్ష్మనిర్మాణక్రమము జర్మసుజాతికి పుట్టులక్షణము. దీనిని గురించి ఒక చిన్న కథ ఉన్నది.

ఒక అధ్యాపకుడు పిల్లలను విహారమునకు తీసుకొని వెళ్ళడానికి ముందుగా చేయవలసిన వి ధానమంతా ఏర్పాటు చేసినాడట.ఏభై మంది పిల్లలు విహారమునకు వస్తామని పేర్లిచ్చినారట. విహారమునకు సంబంధించిన సూక్ష్మ విషయము లన్నీ కలిగిన కార్యక్రమమును 200 పుటలుగా ఆ చ్చు వేసినపుస్తకమును అధ్యాపకుడు ప్రతివిద్యార్థి కిన్ని ఇచ్చినాడట, రైలు బళ్ళలోను, ట్రాముబ ళ్ళలోను, ఏవిద్యార్థి ఎక్క-డకూచ్చోన వలెనో, హో టేళ్ళలోను భోజన టేబిళ్ళవద్దను ఎవరెక్కడ ఉండ వలెనో, ఫాక్టోరీలకు పోయేటప్పుడు ఏవిద్యార్థి వర్గముతోకలసి ఉండవ లెనో, అన్నీ అతడు వ్రాసి యిచ్చినాడు, రైలు కదలడాని కారంభించే సరికి ఒక విద్యార్థి రాలేదు, అధ్యాపకుడు కంగారుపడి “అయ్యో! ఏమి చేయడము” అని గోల చేయ నా రంభించినాడట, అప్పుడొక ఇండియా విద్యార్థి ఆ

197