పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యా దేశములో అనాదిగా ఉన్న దే. బ్రిటిషువారు రాక పూర్వము బడులలో తరగతుల పద్ధతి లేదు. తరగతి మొత్తముమీద పాఠములు చెప్పుతే కాల ముతక్కువ అవుతుందని సాధాణముగా మనమను కొంటాముగాని, ఈ బడిలోని ఉసాధ్యాయుల అభి ప్రాయము వేరు. తరగతి మొత్తముమీద చె ప్పడమువల్ల కాలము కలిసిరాదనన్ని, ఉపాధ్యాయు లకు మాత్రము సులువనిన్ని వారిఊహ.తరగతి "మొత్తముమీద పాఠములు చెప్పడమువల్ల తెలివి గల పిల్లలకే లాభము గాని, మొద్దు పిల్లలు మరింత మొద్దులవు తారు. మధ్య రకము పిల్లలమీదనే ఉ పాధ్యాయుల దృష్టి ఉంటుంది; అందు చేత వారు మి క్కిలి తెలివై నపిల్లలను, మొద్దుపిల్లలను నిఘాలో ఉంచుకోరు.ఈ జర్మముబడిలో తరగతి అనే అభి ప్రాయమును తొలగించడానికి, పిల్లలను వర్గము లుగా ఉంచి, ఒకొక్క వర్గమువారికి ఒకొక్కరంగు గురుతుగా ఉంచుతారు. ఒకొక్కప్పుడు ఉపాధ్యా యులు ఒకొక్క విద్యాన్ని ప్రత్యేకముగా పా ఠము చెప్పుతారు. ఒకప్పుడొక టేపొఠముకోసము

187