పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంఘమువా రీద్వీపమునంతటిని ఈబడికి ఇచ్చి వేసి నారు. ప్రభుత్వమువారే ఇందులోని ఉపాధ్యా యులకందరికిన్ని జీతములిస్తారు.ఇదివసతిబడి. ఇందులో 38 గురుపిల్ల లున్న 5గురు ఉపాధ్యాయు లున్ను ఉన్నారు. ఇందులోని పిల్లలందరున్ను తు దకు అబ్యిరియెంటెన్ పరీక్షకు పోతారు. ఈ పిల్లలలో కొందరు గొప్పఇంటివాండ్లు, బడికి వై ద్యుడు లేడు; ఆరేళ్ళలో ఒక్క సారిమాత్ర మే కావలసివచ్చినాడట; అప్పుడతనిని దగ్గర పల్లెనుంచిపిలి పించినారు. సాధారణ మైన తిండి మోతాదుగా తిన డమున్ను , కావలసినంత వ్యాయామము చేయడ మున్ను పిల్లల ఆరోగ్యమునకు మూల కారణము), పొద్దుటి భోజనమునకు పూర్వము ఏ విద్యార్థిన్ని ద్వీపము చుట్టు 1 1/4 మైళ్ళు పరుగెత్త వ లెను. ఈబడిలో ఇప్పుడు రెండు పరిశోధనలు జరుగు తున్నవి .

(1) డాల్టను పద్ధతి:- తరగతిలోని పిల్లల కందరికీ ఒక్కసారి పాఠములు చెప్పరు. ఒకొక్కరికి ప్రత్యేకముగా చెప్పుతారు. ఈ పద్ధతి ఇండి

186