పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇద్దరు ముగ్గురిని కలిపి చెప్పుతారు. పిల్లలు పాఠము కోసము ఉపాధ్యాయుల దగ్గరకు పోరు; ఉపాధ్యా యులే పిల్లలవద్దకుపో తారు. బడి పెద్దల( మోనిటర్ల) పద్ధతి ఈబడి వారి కిష్టము లేదు; అనగా • తెలివైన పిల్లలను మందమతులకు పాఠములు చెప్పడమునకు ఏర్పరచరు. దానికి బదుగా ఉపాధ్యాయుల సంఖ్యనే ఎక్కువ చేయడము లాభకరమని వారి అభిప్రాయము,

(2) సామాన్య జీవనమున కలవా టు చేయ డము:-ఇది పరిశోధనలో ఉన్న రెండో పద్ధతి. ద్వీప మంతటిలోను పిల్లలవంటకు ఇద్దరు ఆడవాళ్ళు తప్ప, మ రెట్టి కనౌకరులును లేరు. ద్వీపములో రోడ్లను,బడి గదులను, వసతి ఇండ్లను, పిల్లలేను తుడుచుకొంటారు. పక్కలను తామే పరుచుకొంటారు. భోజనచా వడిలో భోజనము చేసే 'టేబిలును తామేసర్దుకొం టారు. తిన్న కంచాలను తామే కడుగుకొంటారు. ద్వీపములోని కోళ్ళను, ఆవులను, వ్యవసాయ పొల మును తామే చూచుకొంటారు.ఈపనులు చేయ డానికి నౌకర్లను నియమించరు. యూరోపులో


188