ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వచ్చును. ఉపన్యాసాలు వినడానికి విద్యార్థులు కొంతసొమ్మి వ్వవలెను. ఆసొమ్మంతా ఈ రిటైర యినప్రఫెసర్లకే ఇచ్చి వేస్తారు.
అధ్యాయము 21
వయస్సుమించిన వారి విద్య,
ఫోక్ హాక్ షూలె (Volkhoch Schule)
చిన్నప్పుడు చదువుకొనడానికి మంచి అవ కాశాలు లేకపోయినవారు యావజ్జీవమున్ను చ దువులేక ఉండనక్కర లేకుండా, వయస్సుమీ రనవారి కోసము జర్మనీలో బడులను ఏర్పాటు చేసినారు, యుద్ధమయిన తరువాత ఈవిషయమై మిక్కిలి శుద్ధ తీసుకొంటున్నారు. ఇటువంటి విద్యను మొదట ఆరంభించిన వారు డెన్మార్కు వారు, 1844 సం|రములో వ్యయసాయదారుల పిల్లల కోసము డెన్మార్కులో ఇట్టి మొదటి "ఫోక్ హాక్ షూలే'ను స్థాపించినారు. ఈబడి 'మొదట మత సంస్థగా ఉండేది. దీనిమీదజనుల కౌదరమెక్కువ
177